తొలిచిత్రంతోనే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌కు జంటగా నటించే గోల్డెన్ ఛాన్స్ అందుకుంది ఇమాన్వీ. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అయితే అంతకంటే ముందు.. ఈ చిత్రం నుంచి ఇమాన్వీ ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ 20న ఆమె పుట్టినరోజు కావడంతో.. ఆరోజు ‘పౌజీ’లోని తన లుక్‌ను రివీల్ చేయబోతున్నారు. ఇలాంటి మూమెంట్ కోసం గత రెండేళ్లుగా ఆమె ఎదురుచూస్తోంది. తన చిత్రాల్లో హీరోయిన్ క్యారెక్టర్‌కు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చే హను రాఘవపూడి.. కచ్చితంగా తనను కొత్తగా ప్రజెంట్ చేస్తారనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రభాస్, ఇమాన్వీ, మిథున్ చక్రవర్తి సహా ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఈ వారంలో ఈ షెడ్యూల్ పూర్తి కానుండగా నవంబర్ 15 నుంచి కొత్త షెడ్యూల్ మొదలవనుంది.
